కాంగ్రెస్ పార్టీని గ్రామాలలో బలోపేతం చేయాలి

– డిసిసి ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్ రెడ్డి
నవతెలంగాణ-భిక్కనూర్
కాంగ్రెస్ పార్టీని గ్రామాలలో బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని డిసిసి ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని కాచాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిసి ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్న విధానాన్ని ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సింగ్ రావు, నాయకులు రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ యాదయ్య, దశరథ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.