– వనదేవతలకు ప్రత్యేక పూజలు
– మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ
నవతెలంగాణ – తాడ్వాయి కేంద్రంలో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావాలని, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కావాలని మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఆదివారం మేడారంలో వనదేవతలకు ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. ఎండోమెంట్ అధికారులు పూజారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీర సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. కండువాలు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ 10 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలనలో ప్రజలు నాన్న ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి రావాలని ప్రతి పౌరుడు కోరుకుంటున్నారని కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ అన్నారు. కాంగ్రేస్ పార్టీ అన్ని వర్గాల వారికి మేలు చేస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశం అభివృద్ధి సాధ్యం కాదని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని, నేను లోక్సభ స్పీకర్గా లేదా మంత్రిగా కావాలని మనదేవతలకు ప్రత్యేక ముక్కలు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.