– రెంజల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోబీన్ ఖాన్
నవతెలంగాణ – రెంజల్
బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని, ప్రభుత్వం హయాం లోనే ప్రజలకు సమన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొబిన్ ఖాన్ స్పష్టం చేశారు. శనివారం రెంజల్ మండలం నీల గ్రామంలోని ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ లను అమలు పరచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీ. జీవన్ రెడ్డి కి తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీని ఆయన గుర్తు చేశారు . ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నాగభూషణం రెడ్డి, జి సాయి రెడ్డి, గంగా కృష్ణ, గణేష్ నాయక్, వినోద్, గంగా కిషన్, అలీముద్దీన్, కర్రీమ్, సోక్కుల సాయిలు, సద్దాం, వెంకటేష్, ఎమ్మెల్ రాజు తదితరులు పాల్గొన్నారు.