బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి..

– రెంజల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొబిన్ ఖాన్ స్పష్టీకరణ

నవతెలంగాణ – రెంజల్ 
భారత దేశంలో బడుగు బలహీన వర్గాల సమన్యాయం కావాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రెంజల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోబిన్ ఖాన్ స్పష్టం చేశారు. గురువారం రెంజల్ మండలం ధూపల్లి, దండిగుట్ట గ్రామాలలోని ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ పథకాలతో ప్రజలకు మరింత చేరువలోకి తీసుకువస్తుందని ఆయన అన్నారు. నేడు ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకం ద్వారా ప్రజల ను నిర్వీణ్యం చేస్తుందని ఆయన విమర్శించారు. బిజెపి ప్రభుత్వం పెట్టుబడిదారులకు పెద్దపీటవేస్తూ బడుగు బలహీన వర్గాల అనగా దృక్కే ప్రయత్నం చేస్తుందని ఆయన అన్నారు. రాబోవు కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కూలీలకు రోజుకి 400 రూపాయలు వచ్చేలా చర్యలు తీసుకొని ఉన్నట్లు ఆయన చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తూచా తప్పకుండా ప్రభుత్వం ప్రకటించిన గ్యారెంటీ పథకాలను అమలు పరిచే విధంగా ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధనుంజయ్, నాగభూషణం రెడ్డి, జి సాయి రెడ్డి, సురేందర్ గౌడ్, జావీద్ ఉద్దీన్, సిహెచ్ రాములు, మోహన్, సాయిబాబా గడ్, ఓ మోహన్, వేణు, సగ్గు వెంకటి, కొజ్జా భూమన్న, శంషాద్దీన్, సిద్ధ సాయిలు, గైనిక్ కిరణ్, ఎల్ కృష్ణ, గంగాధర్, సురేష్, హైమద్, తదితరులు పాల్గొన్నారు.