కాంగ్రెస్ పార్టీ పాలోపేతంకు కృషి చేయాలి: అంబర్ సింగ్

నవతెలంగాణ – నసురుల్లాబాద్
కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిజామాబాద్ జిల్లా జడ్పి ఫ్లోర్ లీడర్, చందర్ జడ్పిటిసి అంబర్ సింగ్ తెలిపారు. మంగళవారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. నసురుల్లాబాద్ మండలానికి విచ్చేసిన నిజామాబాద్ జిల్లా జడ్పి ఫోరం లీడర్ అంబర్ సింగ్ ను మండల కాగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందు పటేల్ ఘనంగా సన్మానించారు.  బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించిన ఎన్రోలర్స్ సేవలను గుర్తించి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఎన్రోలర్స్ కి ప్రోత్సాహకాలు అందజేశారు. నసురుల్లాబాద్ మండలంలో 18 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నమోదు చేసిన ఎన్రోలర్స్ కి ఒక్కొక్కరికి. జడ్పి ఫోర్ లీడర్ అంబర్ సింగ్ 5వేల చొప్పున నగదును అందించారు. ఈ సందర్భంగా అంబర్ సింగ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉత్సాహంగా ఉన్న పార్టీ కార్యకర్తలు ఈ అవకాశం వినియోగించుకోవాలని పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని వారు అన్నారు. టీపీసీసీ ఆదేశాల మేరకు మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలి అన్నారు. బాన్సువాడ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. 2024లో జరగనున్న సార్వ త్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యకమంలో మండల అధ్యక్షులు నందు పటేల్ సర్పంచ్ అరిగెల సాయిలు, బొమ్మన్ దేవ్ పల్లి సర్పంచ్ సత్యనారాయణ, మైనార్టీ నాయకులు యూసుఫ్, కలిమ్, చందూర్ మండల అధ్యక్షులు పోతరాజు శ్రీనివాస్, మహేందర్ గౌడ్, సాయగౌడ్, ప్రకాష్, సురేష్, గంగాధర్, రామన్న, మహేందర్ చౌహాన్, లింగం, శివ ప్రసాద్, భాస్కర్ గౌడ్, సత్యనారాయణ, కాంత్ రెడ్డి, సరిచంద్, మోహన్, కృష్ణ, శ్రీనివాస్, నర్సింగ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.