నవతెలంగాణ – గోవిందరావుపేట
ఇటీవల అనారోగ్యంతో అభివృద్ధి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ కురుసం కన్నయ్య కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ అన్నారు. శుక్రవారం మండలంలోని మొట్ల గూడెం గ్రామంలో కన్న య్య పెద్దకర్మకు వెంకటకృష్ణ హాజరై కన్నయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వెంకటకృష్ణ మాట్లాడుతూ ఎంపీటీసీగా కార్యకర్తగా నాయకుడిగా కన్నయ్య సేవలు చిరస్మరణీయమని అన్నారు. అనంతరం కన్నయ్య కుటుంబ సభ్యులకు రూ.10000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు వెంట సన్న బియ్యం అందించారు.ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట మండల రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు.