– దశదినకర్మకు ఆర్థిక సహాయం
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లంజపెల్లి నరసయ్య తల్లి లంజపెల్లి వెంకటలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు దశదినకర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి, రూ. 8 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అదే గ్రామంలో మరో కుటుంబం రాధారపు సంజీవ్ అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి రూ.2000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ మాట్లాడుతూ మాట్లాడుతూ మత్తుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ముజఫర్, తాడ్వాయి మాజీ సర్పంచ్ సునీల్ దొర, బీసీ సెల్ అధ్యక్షులు పులి రవి గౌడ్, నాయకులు మెడిశెట్టి ఆనందం, మద్దూరి రాజు, పల్నాటి సత్యం, బండారు చంద్రయ్య, పుల్లూరి నాగార్జున కన్నెం కనుమల శ్రీను తదితరులు పాల్గొన్నారు.