మృతుని కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది

Congress party stands by the family of the deceasedనవతెలంగాణ – తొగుట
బాలరాజు అకస్మాతగా మరణించడం ఆ కుటుం బానికి తీరనిలోటు అని మాజీ సర్పంచ్ పాత్కుల లిలాదేవి వెంకటేశం అన్నారు. మంగళవారం మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో కేసు బాలరాజు అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందాడు. బాల రాజు చిన్న వయసులో మరణిం చడం చాలా బాధాకరం, కుటుంబానికి పెద్ద దిక్కు గా ఉండాలిసిన ఆయన అకస్మాతగా మరణిం చడం ఆ కుటుంబానికి తీరనిలోటు అన్నారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి 3 వేల ఆర్థిక సహాయం అందించి, ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంద న్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపా ధ్యక్షులు బెజ్జనబోయిన అనిల్, గ్రామ పార్టీ అధ్య క్షులు మిద్దె సంతోష్, సీనియర్ నాయకులు పోత రాజు రవి, రాములు, కనేశ్, కరుణాకర్, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు బెజ్జనబోయిన ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.