వరదల వల్ల నష్టపోయిన బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది: సీతక్క

నవతెలంగాణ-గోవిందరావుపేట
వరదల వల్ల నష్టపోయిన బాధితులందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి ఆదుకుంటుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. శనివారంనెస్ట్లి, జె.సి.ఐ. సంస్థల సహాయ, సహకారాలతో వరద బాధితులకు 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు సీతక్క పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని అన్నారు. పేదల కష్టాల్లో అండగా ఉండి పంచుకునేది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు గమనించాలని అన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రజల కష్టాలను గట్టెక్కించే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఇండ్లు నీట మునిగి, పంట పొలాలు కొట్టుకుపోయి ప్రజలు నష్టపోయారని అన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి గ్రామానికి నేను నా వంతుగా స్వచ్ఛంద సేవా సంస్థల సహకారాలతో సహాయం చేస్తూ వచ్చానని అన్నారు. అలాగే వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సహాయం చేయాలని డిమాండ్ చేశానని, అయినను ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయకుండా చోద్యం చూస్తుందని అన్నారు. ప్రజల కష్టాల్లో ప్రజల డబ్బును కూడా పంపిణీ చేయకుండా అక్రమ ఆస్తులు సంపాదిస్తూ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళా ఓట్ల కోసం ప్రజల దగ్గరకు వస్తున్నారని అన్నారు. బి.ఆర్.ఎస్.ప్రభుత్వం వరదల వల్ల ప్రాణాలు పోతుంటే అత్యవసర సేవలు కూడా అందించలేదని అన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక కుటుంబానికి నా వంతుగా కొంగు పట్టి అడిగి స్వచ్ఛంద సంస్థల ద్వారా నా వీలైన సహాయం చేశానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఇంఛార్జి కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి సూదిరెడ్డి జనార్ధన్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, ఎంపీటీసీ గుండెబోయిన నాగలక్ష్మి – అనిల్ యాదవ్, సర్పంచ్ మంగ ఎలెంద్ర – నరసింహ, వాసం కన్నయ్య, గ్రామ అధ్యక్షులు నాయిని వెంకన్న, వాసం బాబు, వాసం రాము, గాంధర్ల సాంబయ్య, గుండె శరత్, బల్గురి శ్రీను, రేగ కృష్ణారావు, రాజశేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు.