– వైస్ ఎంపీపీ జేక్కి పరమేష్
నవతెలంగాణ- నూతనకల్: గ్యారెంటీ లేని కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో ఓడించాలని వైస్ ఎంపీపీ జేక్కి పరమేష్ మంగళవారం ఒక ప్రకటనలో ఓటర్లను కోరారు. పార్టీ గత 68 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ చెయ్యని అభివృద్ధి ఇప్పుడు ఎలా సాధ్యమైతుంది అని అన్నారు. అమలకు సాధ్యం కానీ ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం హాస్యస్పందన మనీ విమర్శించారు 6 గ్యారంటీలు కాదు కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలలకు ఒక ముఖ్య మంత్రి మారడం ఖాయమని ఉన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసి బంగారు తెలంగాణగా మార్చారని తుంగతుర్తి శాసనసభ బీఆర్‌ఎస్ అభ్యర్థి గాదరికిషోర్ కుమార్ కు అత్యధిక ఓట్లు వేసి మెజార్టీతో గెలిపించాలని కోరారు.