కాంగ్రెస్ పార్టీ మహిళ సభ్యత్వ నమోదు

Vallemkunta నవతెలంగాణ – మల్హర్ రావు.
తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు,భూపాలపల్లి జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు కొండ రాజమ్మ ఆధ్వర్యంలో గురువారం మండలంలోని వల్లెంకుంట గ్రామంలో మహిళ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మహిళా సంక్షేమ పథకాలు అందరికీ చేరువలో ఉన్నందున గ్రామాలలో ఉన్న మహిళలందరూ పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకున్నట్లుగా తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళ కాంగ్రెస్ నాయకురాళ్లు ఎడ్ల పోసక్క,రజిత,రమాదేవి,మంజుల, వేల్పుల కమల,రాజమ్మ, లక్ష్మన్, తిరుపతి, బాలయ్య, సమ్మిరెడ్డి,సాగర్, మహిళలు పాల్గొన్నారు