నవతెలంగాణ – భీంగల్
రాష్ట్రంలో మహిళా సంఘాల బలోపేతమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని డీసీసీ ప్రధాన కార్యదర్శి కుంట రమేష్ అన్నారు. గురువారం మండలంలోని మెండోరా గ్రామ డ్వాక్రా మహిళా సమాఖ్య, మెండోరా గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కుంట రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడానికి హైదరాబాదులో లక్ష మందితో మహిళా శక్తి సభ నిర్వహించారని, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా, రానున్న రోజుల్లో మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించనున్నామన్నారు, దురదృష్టవశత్తు మహిళా సంఘ సభ్యురాలు చనిపోతే, ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి పది లక్షల రూపాయల బీమా సౌకర్యం పథకం సీఎం ప్రారంభించారని తెలిపారు. ఉచిత సిలిండర్ పథకము గృహ జ్యోతిలో భాగంగా జీరో బిల్లులను చూసి మహిళలు ఎంతో సంతోష పడుతున్నారని రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారని, త్వరలోనే పేదలకు తెల్ల రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందని, ఇల్లు లేని పేద మధ్యతరగతి మహిళలకు ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇళ్ళను నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరా క్రాంతి పథం, సీసీలు, కుంట శ్రీనివాస్ పురస్త్ నరేష్, మహిళా సమాఖ్య సభ్యులు పుష్ప, వినోద, సుమలత, యాస్మిన్, 200 మంది మహిళా సంఘ సభ్యులు, మరియు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రాజేశ్వర్గౌడ్, ఉపాధ్యక్షులు గౌరు లింబాద్రి, మండల నాయకులు,పల్లె శేఖర్, గంగాధర్, యూత్ కాంగ్రెస్ సెక్రెటరీ రాజేందర్ గౌడ్, సుమన్ మనోహర్ ప్రశాంత్, దిలీప్,ఆనంద్, రవి, గ్రామ కాంగ్రెస్ నాయకులు, సప్పల సత్యనారాయణ,పోషన్న షఫీ, పుర్రె రాజేందర్ లౌడ్య లింబాద్రి, ఖదీర్ గౌర్ రాజన్న, సురేష్, గొల్ల భూమన్న కల్లెడ భూమన్న తదితరులు పాల్గొన్నారు.