– కేసీఆర్, కేటీఆర్, దత్తతతోనే కొడంగల్ వెనుకబాటు
– కేెసీఆర్‌కు ఓటమి భయం
– కొడంగల్ రెవెన్యూ డివిజన్ చేస్తాం
– ముక్కలు చెక్కలుగా కొడంగల్‌ను చేశారు
– టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
– ఎంపీపీ ముద్దప్ప, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, మరికొంతమంది పార్టీలో చేరిక
నవతెలంగాణ-కొడంగల్
రాష్ట్ర అభివృద్ధే కాంగ్రెస్ విధానమని టీపీసీసీ అధ్యక్షు లు రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్‌లోని మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి నివాసంలో గుర్నాథ్ రెడ్డి కొడుకు మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, ఎంపీపీ ముదప్ప దేశ్ముఖ్, మాజీ జడ్పీ టీసీ ఏనుగుల భాస్కర్, జయతీర్థ చారిలు మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి సమక్షంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డీసీసీ రామ్మోహన్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కలిసి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీ సీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం, కోస్గిల్లో పాలిటెక్నిక్ కళాశా లను ఇంజనీరింగ్ కళాశాల చేయడం, కొడంగల్ నియోజ కవర్గంలోని మండలాలను కలుపుకొని రెవెన్యూ డివిజన్ ఏ ర్పాటు చేయడం, వికారాబాద్ నుండి కృష్ణా లైన్ వేయడం, పరిశ్రమలు ఏర్పాటు, కొడంగల్‌లో చదువుకున్న నిరుద్యోగు లకు ఉద్యోగాలు కల్పించడం, జూనియర్ కళాశాలలు, మహి ళా డిగ్రీ కళాశాల, అంతర్జాతీయ పరిశ్రమలు తీసుకురావ డం, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కంటే కొడంగల్‌ను అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా చేయడమే కాంగ్రెస్ విధానమన్నారు. కొడంగల్‌లో ప్రశాంతమైన వాతావరణం కక్షలు లేని జీవితం గడిపే విధంగా ప్రజలకు బతకడానికి స్వేచ్ఛను ఇవ్వడం తమ విధానమన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయడం, ఇల్లు లేని ప్రతి వారికి 5 లక్షల తో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. ఆరోగ్యశ్రీతో 5 లక్షల వరకు ఉచితంగా ఇస్తామని 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా మన్నారు, పింఛన్ దారులకు 4000 పింఛన్ నెల 1వ తేదీన అందిస్తామని 1200 సిలిండర్‌ను 500కి అందిస్తామన్నారు. అసైన్డ్ భూములపై ఎస్సీ, ఎస్టీలకు సర్వ హక్కులు కల్పిస్తామన్నారు. కేసీిఆర్, కేటీఆర్, హరీష్ రావు లు గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటలతో సమానంగా కొడంగ ల్‌ను అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారని కొడంగల్ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌లతో ఎందుకు అభివృద్ధి చెందలే దని ప్రశ్నించారు. నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్‌తో 1500 కోట్లతో లక్ష 7 వేల ఎకరాలకు స్వాగతంగా కొడంగల్‌కు సా గునీటిని తీసు కువచ్చేందుకు 8 టీఎంసీల నికరజలాలకు నిధులు మంజూరు చేయించుకుంటే నారాయణపేట ఎత్తి పోతల పథకం ఆపి కొడంగల్‌కు అన్యాయం చేశారన్నారు. కృష్ణా రైల్వే లైన్, రాళ్లపల్లిలో సిమెంట్ ఫ్యాక్టరీ రాకపోవడానికి కేసీఆర్, కేటీఆర్‌లే కారణమన్నారు. ఇప్పటికైనా కొడంగల్ ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓటుతో బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాల న్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రామ్మోహ న్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, కాంగ్రెస్ నియోజక వర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి, ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, టీపీసీసీి ప్రతినిధి యూసుఫ్, కాంగ్రెస్ మండలాధ్యక్షులు నందరం ప్రశాంత్, కొడంగల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణంరాజు, ఏనుగుల భాస్కర్, సర్పంచ్ బాల్ రెడ్డి, నయుం, దాము, రాము, బాల్‌రాజ్, తదితరులు పాల్గొన్నారు.