
నవతెలంగాణ – పెద్దవంగర
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అధ్యక్షతన మండల యూత్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సురేష్ తో కలిసి మాట్లాడుతూ.. త్వరలో జరుగనున్న ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలన్నారు. యూత్ నాయకులు సమన్వయంతో పని చేస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో పాలకుర్తి దేవస్థాన డైరెక్టర్ పన్నీరు వేణు, జిల్లా సంయుక్త కార్యదర్శి పూర్ణచందర్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు రంగు మురళి, ప్రధాన కార్యదర్శి ఓరుగంటి సతీష్, బీసీ సెల్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, పట్టణ యూత్ అధ్యక్షుడు అనపురం వినోద్ గౌడ్, యూత్ ప్రధాన కార్యదర్శి కొండ్రాతి శ్రీనాథ్, యూత్ ఉపాధ్యక్షుడు పబ్బతి సంతోష్, మండల ఎన్.ఎస్.యూ.ఐ అధ్యక్షుడు తాటిపాముల సంపత్ తదితరులు పాల్గొన్నారు.