– బీజేపీ ఎమ్మెల్యేలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని హెచ్చరించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఎమ్మెల్యేలు వెంకటరమణా రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రాజాసింగ్ తదితరులు మాట్లాడారు. ప్రగతిభవన్‌ను స్టడీ సర్కిల్‌గా మారుస్తామన్న హామీని కాంగ్రెస్ విస్మరించిందని విమర్శించారు.