– బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తెలంగాణ బీసీలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు. శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో కలిసిన ఆయన సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీసీ క్రిమిలేయర్ ఎత్తి వేయడం, స్థానిక సంస్థల్లో బీసీలకు ఇప్పడున్న 18 శాతం రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం, జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడం తదితర అన్ని హామీలను నెరవేర్చాలని కోరారు.