– గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకట్ గౌడ్
నవతెలంగాణ – కామారెడ్డి
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు గ్రామ పంచాయతీ వర్కర్స్ కు పర్మినెంట్ చేసి వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చి 7 నెలలు కావస్తున్నా గ్రామ పంచాయతీ కార్మికులను పట్టించు కోవడం లేదని, వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేకపోతే గ్రామ పంచాయతీ కార్మికుల పోరాటం ఉధృతం చేస్తామన్నారు. పోరాటం లో బాగంగా గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా సమస్యలు పరిష్కారించాలని కోరుతూ ఆగస్టు 8 వ తేదీన ఒక్క రోజు సమ్మె ను జయప్రదం చేయాలని గ్రామపంచాయతీ కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అద్యక్షులు బాలనర్సు,రాజన్న, మల్లేష్, శ్యాం, స్వామి తదితరులు పాల్గొన్నారు.