గడ్డం వంశీకృష్ణ గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు

నవతెలంగాణ – మల్హర్ రావు
మంగళవారం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్దిగా గడ్డం వంశీకృష్ణ 1 లక్ష 31 వేయి 581 మెజార్టీతో తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,శ్రీపాద ట్రస్టు చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు సహకారంతో గెలుపొందిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య, మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు బాణ సంచా పెల్సి,స్విట్లు పంచి సంబరాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,యూత్ నాయకులు,మహిళ నాయకురాళ్లు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.