
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ సమయానికి గురువారం మండలంలోని పసర గ్రామ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు కొల్లు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రగతి భవన్ ను బద్దలు కొడతామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానంతరం ప్రగతి భవన్ చుట్టూ ఉన్న కంచె తీసి వేయించి జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా మార్చారని అన్నారు. ఈ భవన్లోనే ప్రజా దర్బారు నిర్వహించనున్నారని అన్నారు. దొరల తెలంగాణ పోయిందని ప్రజల తెలంగాణ వచ్చిందని అన్నారు.
6 గ్యారంటీ లపై తొలి సంతకం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. సోనియమ్మ ఇచ్చిన నిజమైన తెలంగాణ ఇప్పుడు ప్రజలకు కనిపిస్తోందని అన్నారు. దొరల పాలనా కుటుంబ పాలన అంతమైందని ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలన మొదలైందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ తోపాటు యువజన కమిటీ పలువురు ప్రజా పతినిధులు మహిళలు పాల్గొన్నారు.