విజయభేరి సభకు తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు

నవతెలంగాణ- కమ్మర్ పల్లి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో నిర్వహించిన విజయభేరి సభకు కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పలు వాహనాల్లో పెద్ద ఎత్తున విజయ భేరీ సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయేలా టిపిసిసి ఆధ్వర్యంలో విజయభేరి సభ జరుగుతుందన్నారు. తెలంగాణ దశ దిశను మార్చే కాంగ్రెస్ గ్యారంటీల ఆవిష్కరణకు ఈ సభ సాక్షిగా నిలుస్తుందన్నారు.  ఈ సభలో కాంగ్రెస్ పార్టీ  తెలంగాణలో అధికారంలోకి వస్తే అమలు చేయనున్న ఆరు గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ అగ్రనేత  qసోనియాగాంధీ ఈ వేదికపై ప్రకటిస్తారని తెలిపారు. కాంగ్రెస్ విజయభేరి సభకు తరలి వెళ్ళిన వారిలో  పార్టీ నాయకులు నిమ్మ రాజేంద్రప్రసాద్, సుంకేట శ్రీనివాస్, ఉట్నూర్ ప్రదీప్, వేములవాడ జగదీష్, సాయికుమార్, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.