వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సభ, ఇందిరా మహిళా శక్తి సభకు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలి వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులు హాజరైన సభకు మండలంలోని పలు గ్రామాల నుండి, మహిళలు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. కార్యక్రమంలో నాయకులు రంగు మురళి గౌడ్, గద్దల ఉప్పలయ్య, ఎండీ జాను, బండారి వెంకన్న, రామకృష్ణారెడ్డి, దంతాలపల్లి ఉపేందర్, ఉప్పలయ్య, సుంకరి అంజయ్య, అనపురం వినోద్ తదితరులు పాల్గొన్నారు.