ప్రజాపాలనలో ప్రజలకు కాంగ్రెస్ శ్రేణుల సహకరించాలి..

నవతెలంగాణ – బెజ్జంకి

నేటి నుండి జనవరి 6 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజలకు కాంగ్రెస్ శ్రేణులు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముకీసా రత్నాకర్ రెడ్డి బుధవారం సూచించారు.గత తొమ్మిదేళ్లుగా ఆర్హులైన ప్రజలు సంక్షేమ పథకాల్లో పారదర్శకంగా లబ్ధిదారులగా ఎంపికవ్వడం కోసం కాంగ్రెస్ శ్రేణులు దోహదపడాలని రత్నాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.