భవాని రెడ్డిని కలిసిన కాంగ్రెస్ శ్రేణులు..

Congress ranks who met Bhavani Reddy..నవతెలంగాణ – బెజ్జంకి
వ్యవసాయ శాఖ కమీషన్ సభ్యురాలిగా నియామకమైన భవాని రెడ్డిని హైదరాబాద్ యందు తన స్వగృహంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించినట్టు ఆర్టీఐ ప్రచార కమిటీ చైర్మన్ రాసూరి మల్లికార్జున్ తెలిపారు. ఎలాంటి అంక్షల్లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ రైతులకు వర్తింపజేయాలని కాంగ్రెస్ శ్రేణులు భవాని రెడ్డికి విజ్ఞప్తి చేసినట్టు మల్లికార్జున్ తెలిపారు. సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి, చైర్మన్ కోదండ రెడ్డి,టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్తానని భవాని రెడ్డి వెల్లడించినట్టు మల్లికార్జున్ తెలిపారు. గాదం స్వామి, పులి రమేశ్,గాదం మల్లికార్జున్ పాల్గొన్నారు.