బీరెల్లి, కాటాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ప్రచారం

నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని బీరెల్లి, కాటాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు మహబూబాబాద్(మానుకోట) ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ కు అందరూ ఓటు వేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని విస్తృత ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, కాంగ్రెస్ పార్టీతోనే దేశానికి అన్ని రకాలుగా మేలు జరుగుతుందని ఇల్లు ఇల్లు తిరిగి గడపగడపకు విస్తృత ప్రచారం నిర్వహించారు. పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకి బలంగా తీసుకొని వెళ్తూ ఇళ్లిళ్లు తిరుగుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రచార కరపత్రాలను పంచుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కాగా నార్లాపూర్ గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బలరాం నాయక్ ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, మండల ఇన్చార్జి కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీరెల్లి మాజీ సర్పంచ్ బెజ్జూరి శ్రీనివాస్, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లెం సాంబశివరావు,జాజ శివ, పాలకుర్తి మధు, పులి నరసయ్య గౌడ్, ముజాఫర్ హుస్సేన్, మేడిశెట్టి ఆనందం, పులి రవి, పల్నాటి సత్యం, మర్రి నరేష్, కూర రాజు, రామారావు, తండాల శ్రీను, మొక్క శ్రీను, తాలూకా సంపత్, తోలెం కృష్ణ మొదలగు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.