బీసీల ఆకాంక్షలను గౌరవించిన కాంగ్రెస్‌

బీసీల ఆకాంక్షలను గౌరవించిన కాంగ్రెస్‌– కులగణనపై రాష్ట్రవ్యాప్తంగా విస్తత ప్రచారం : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌
హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో సమగ్ర కుల గణన చేయడానికి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీల ఆకాంక్షలను నెరవేర్చి బీసీల మనోభావాలను గౌరవించిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. అలాగే చారిత్రకమైన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీకి ముఖ్యంగా సీఎం రేవంత్‌ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్ర మార్కకు, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అయన ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల గణన నిర్వహించాలని రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా నియోజకవర్గ మండల కేంద్రాల్లో శనివారం ”బిసి కులగనణ సాధన విజయో త్సవల” ను పెద్ద ఎత్తున నిర్వహించారు. అందులో భాగంగానే హైదరాబాదులోని అలీ కేఫ్‌ వద్ద ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం వద్ద ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గౌడ్‌ ఇతర బీసీ సంఘాల నేతలు కలిసి జ్యోతిబాపూలే విగ్రహానికి పాలాభిషేకం చేశారుజ అనంతరం విగ్రహం వద్ద వివిధ వత్తులు చేసుకునే బీసీ కులాల వారికి మిఠాయిల పంపిణీ చేశారు.