– కాంగ్రెస్ కల్వకుర్తి అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి
నవతెలంగాణ-తలకొండపల్లి
కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ప్రకటించిన పథకాలను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలోని వెంకటాపూర్, చెన్నంపల్లి గ్రామ పంచాయతీలో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రకటించిన పథకాలను ప్రజలకు వివరించారు.అనంతరం కసిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఇండ్లు లేని పేదవారికి రూ. 5 లక్షల సాయం చేస్తుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. కల్వకుర్తిలో కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు పదవులు తప్ప అభివృద్ధి ఎక్కడ చేపట్టలేదన్నారు. మండలంలో గవర్నమెంట్ కళాశాల కాగితాలకే పరిమితం అయ్యిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రకటించిన పథకాలు పేదలు ఎవరికి చేరలేదన్నారు. డబుల్ ఇండ్లు ఏ ఒక్కరికీ ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు భగవాన్ రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి రవీందర్ యాదవ్, ఆల్ ఇండియా సేవాదళ్ కార్యదర్శి దశరథం, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ అజీమ్, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డిగ్రీ కృష్ణ, మండల మైనారిటీ అధ్యక్షులు అరిఫ్, ఎస్సీ సెల్ చైర్మన్ చెన్నకేశవులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నరసింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్, దేవుని పడకల్ సర్పంచ్ శ్రీశైలం, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, వెంకటాపూర్ ఎంపీటీసీ సునీత సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ రమేష్ యాదవ్, ఉప్ప సర్పంచ్ లలిత, తిరుపతయ్య, వెల్జాల్ ఎంపీటీసీ అంబాజీ, ఉప సర్పంచ్ అజీజ్, వద్దే రాజు, అశోక్, మాజీ ఎంపీపీ, మాజీ ఎంపిటిసి రాములు, తిరుపతి రెడ్డి, సీనియర్ వార్డు మెంబర్ పబ్బతి వెంకటయ్య, నాయకుడు డేవిడ్, తలకొండపల్లి, కడ్తాల మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు తలకొండపల్లి సోషల్ మీడియా ఇన్‌చార్జి శశిధర్ రెడ్డి, వెంకటాపూర్ సీనియర్ నాయకులు చొప్పరి మల్లేష్ ,రవి, శేఖర్, మహేష్, శ్రీను, తిరుపతి, రవీందర్, రాములు, ఢిల్లీ కాజా, ఢిల్లీ ఆంజనేయులు, జింకల శేఖర్ ,శంకర్ ,వడ్ల యాదయ్య ,ఆంజనేయులు , చిన్న జంగ్లీ, చంద్రు కృష్ణయ్య, ఆంజనేయులు, శ్రీకాంత్, సొప్పరి శీను, గ్రామస్తులు కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.