
– కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి
నరేందర్ రెడ్డి గెలుపు ఖాయం
– శివ చరణ్ రెడ్డి
నవతెలంగాణ కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో యువజన కాంగ్రెస్‌కు మంచి భవిష్యత్తు ఉందని, ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ గెలుపే ఖాయమని కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్- మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అన్నారు.బుధవారం కరీంనగర్ పట్టణంలోని ఈఎన్ గార్డెన్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కటి శివ చరణ్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. కరీంనగర్ జిల్లాకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం యువతకు గొప్ప వరంగా అభివర్ణించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒకే ఏడాదిలో 55,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. రాష్ట్రంలో ఆర్థిక లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, ప్రతి నెలా 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సమయానికి అందేలా చూస్తోంది. మేము రాజకీయాల్లోకి రావడం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, నిరుద్యోగ యువతకు అండగా నిలవడానికే” అని నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.నాలుగు నెలలుగా జిల్లాలో పర్యటిస్తున్న తనకు
అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయని. ముఖ్యంగా నిరుద్యోగ యువత, విద్యార్థుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తా అని హామీ ఇచ్చారు.
నరేందర్ రెడ్డి గెలుపు ఖాయం
– శివ చరణ్ రెడ్డి
రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కటి శివ చరణ్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ప్రకటించిన వెంటనే ఆయన గెలుపు ఖాయమైందని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో యువజన కాంగ్రెస్ కార్యకర్తల కృషితో నరేందర్ రెడ్డి గెలుపు మెజారిటీ అత్యధికంగా ఉంటుంది. రానున్న 20 రోజుల్లో ప్రతి కార్యకర్త కనీసం 200 ఓట్లు పోలయ్యేలా కృషి చేయాలి అని పిలుపునిచ్చారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ కీలక భూమిక పోషిస్తుందని, మొదటి ప్రాధాన్యత ఓటును నరేందర్ రెడ్డికి వేయాలని శివ చరణ్ రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో పాడాల రాహుల్, అవినాష్ గౌడ్, వెంకటేష్, ముత్యం శంకర్, ఫహద్, బీరం రాజేష్, గుర్రం వాసు, మునిగంటి అనిల్, బండి కిషన్ రెడ్డి, ఆంక్ష రెడ్డి, వినూత్న రెడ్డి, జెరిపోతుల వాసు తదితర యువజన నాయకులు పాల్గొన్నారు.