స్ధానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి..

Congress should be wise in local body elections..– ములుగు జడ్పీ మాజీ చైర్మన్ బడే నాగజ్యోతి

– డైవర్షన్ రాజకీయాలను చేస్తున్న రేవంత్ రెడ్డి
నవతెలంగాణ – తాడ్వాయి   
 అబద్ధపు పునాదుల మీద స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి, స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ములుగు జడ్పీ మాజీ చైర్పర్సన్, బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. బుధవారం మండలంలోని మేడారం వనదేవతల సన్నిధిలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన బడే నాగజ్యోతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కానీ ఆరు గ్యారెంటీలను ఇస్తామని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎలక్షన్లలో చిత్తుచిత్తుగా ఓడించాలని అన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రి హయాంలో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి సాధించిందన్నారు. పాలన చేతకాని రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను ప్రతి పథకానికి దరఖాస్తులు ఇవ్వాలని, నిత్యం అయోమయానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల్లో నిలదీయాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమాయత్తం కావాలని కోరారు. ములుగు జిల్లాలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దండగుల మల్లయ్య, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ దుర్గం రమణయ్య, మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు కాక లింగన్న, రేగ నరసయ్య, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు, మాజీ జెడ్పిటిసి రామసాయం శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాయం నరసింహారావు, సీనియర్ నాయకులు పత్తి గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచులు చిడం బాబురావు, గొంది శ్రీధర్, ఊకె మోహన్ రావు, సీనియర్ నాయకులు సిద్ధబోయిన శివరాజు, అర్రేం కృష్ణ, వట్టం శోభన్, వహెద్,దానక నర్సింగరావు,సాయిరి లక్ష్మీ నరసయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.