కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలి

– ప్రకాష్‌గౌడ్‌ను లక్ష మెజార్టీతో గెలిపించాలి
– ఇంటింటి ప్రచారంలో బీఆర్‌ఎస్‌ నాయకులు
నవతెలంగాణ-గండిపేట్‌
ఈ నెల 30న నిర్వహించ ేశాసనసభ ఎన్నిక పోలింగ్‌లో కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని గండిపేట్‌ మండలాధ్యక్షులు రామేశ్వరం నరసింహ, చైర్‌పర్సన్‌ రేఖ యాదగిరి తెలిపారు. బుధవారం గండిపేట్‌ మండలం మట్టినాగులపల్లి గ్రామంలో సీనియర్‌ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో ఒక్కరికి న్యాయం జరగలేదన్నారు. రాజేంగ్రనగర్‌ను అభివృద్ధి చేస్తున్న ప్రకాష్‌గౌడ్‌ను మరోసారి గెలిపించాలని కోరారు. ఎన్నికల ముందు ప్రకటించిన అన్ని పథకాలను అమలు చేసినట్టు తెలిపారు. మళ్లీ ఇప్పుడు ప్రకటించిన పథకాలను గెలుపొందిన వెంటనే అమలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌ యాదవ్‌, మాజీ ఎంపీపీ తలారి మల్లేష్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, సహకార సంఘ వైస్‌ చైర్మన్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ మేకల ప్రవీణ్‌ యాదవ్‌, నాయకులు విష్ణువర్ధన్‌ పరివేద రాజు బక్కని సాయి మాజీ ఎంపీటీసీలు ధారా వెంకటేష్‌ నాగేష్‌ యాదవ్‌, కౌన్సిలర్‌ శివారెడ్డి డైరెక్టర్లు మహేష్‌ రెడ్డి వేణుగోపాల్‌ రెడ్డి, సహకార సంఘం చైర్మన్‌ తోల్కట్ట కష్ణ , నాయకులు బిక్షపతి నాయకులు తదితరులు పాల్గొన్నారు.