కాంగ్రెస్ గ్యారంటీ హామీలను ప్రజలకు వివరించాలి

– టీపీసీసీ మాజీ సభ్యులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి

నవతెలంగాణ పెద్దవంగర: కాంగ్రెస్ గ్యారెంటీ హామీలను కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని టీపీసీసీ మాజీ సభ్యులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని బొమ్మకల్లు గ్రామంలో కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ కార్యకర్తలు కేటాయిస్తూ, అర్హులైన పేదలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో పేదలకు న్యాయం జరగదని, కాంగ్రెస్ పార్టీ తోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం గ్రామానికి చెందిన గంగారపు వీరమల్లు అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. వీరమల్లు ను పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీసు హరికృష్ణ, రెడ్డికుంట తండా సర్పంచ్ బానోత్ జగ్గా నాయక్, ధరావత్ మోతీరామ్, ధరావత్ శంకర్, రంగు అశోక్, బీసు నాగరాజు, పొడిశెట్టి మధు, వీరయ్య, మల్లయ్య, రవి, యాదగిరి, సంపత్, రామయ్య, బాలు, జంపయ్య, సారయ్య, నిమ్మల బిక్షం, ఎస్కే అన్వర్, రామ్మూర్తి, నిమ్మల స్రావిక, బీసు సునీత, ఎస్కే సలీమ, బీసు భద్రమ్మ, మడిపెద్ది మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.