ఉపేందర్ పై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్ 

Action should be taken on Upender: Congressనవతెలంగాణ – పెద్దవంగర
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి లపై తప్పుడు ఆరోపణలు చేసిన జాటోత్ ఉపేందర్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బానోత్ సీతారాం నాయక్, బానోత్ వెంకన్న, గ్రామ పార్టీ అధ్యక్షుడు గద్దల ఉప్పలయ్య కోరారు. నిరాధార ఆరోపణలు చేస్తున్న ఉపేందర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్సై క్రాంతి కిరణ్ కు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మెప్పు కోసం ఎమ్మెల్యే, ఝాన్సీ రెడ్డి లపై తప్పుడు ఆరోపణలు చేయడం దుర్మార్గం అన్నారు. మరోసారి తమ నాయకురాలి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. కార్యక్రమంలో రంగు మురళి గౌడ్, పూర్ణచందర్, దాసరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుధాకర్, అనపురం శ్రీనివాస్, లింగమూర్తి, బానోత్ సోమన్న, ఎండీ జాను, చిలుక సంపత్, పవన్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.