
– మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ – పెద్దవంగర
కాంగ్రెస్, బీజేపీ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆయన మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఉద్యమకారుడు డాక్టర్ సుధీర్ కుమార్ ను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. హామీలు అమలు కావాలంటే ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. ఉద్యమకారుడైన డాక్టర్ సుధీర్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తే వరంగల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. బీఆర్ఎస్ కు భారీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్, పాలకుర్తి యాదగిరి రావు, దుంపల సమ్మయ్య, జ్ఞానేశ్వర చారి, వేముల రఘు, వేణుగోపాల్ రావు, ఎండీ షర్ఫీద్దీన్, అనపురం రవి, రెడ్యబోయిన గంగాధర్ యాదవ్, కృష్ణమూర్తి, వెంకట్ రెడ్డి, చిలుక బిక్షపతి, సుంకరి ఏసయ్య తదితరులు పాల్గొన్నారు.