– ఎమ్మెల్యే మల్‌రెడ్డ్డి రంగారెడ్డి
– పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా బట్టు శ్రీనివాస్
– నియామకపత్రం అందజేసిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-యాచారం
గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సూచించారు. ఆదివారం యాచారం మండల పరిధిలోని మాల్ గ్రామానికి చెందిన బట్టు శ్రీనివాస్‌ను పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రాన్ని ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం శ్రీనివాస్ కు పలువురు కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పని చేసే వారికి పదవులు ఉంటాయని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేయాలని కోరారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు ఇప్పటినుంచి ప్రయత్నించాలని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మస్కు నరసింహ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వరికుప్పల సుధాకర్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు లిక్కి పాండురంగారెడ్డి, నాయకులు మల్లేష్, గడల మల్లేష్, కప్పటి యాదయ్య, వరికుప్పల రాజు, కొప్పుల వెంకటేష్, మిర్యాల రమేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.