– కాంగ్రెస్ రాజేంద్రనగర్ అభ్యర్థి కస్తూరి నరేందర్‌ను గెలిపిద్దాం
– నార్సింగిలో ముఖ్య నాయకుల సమావేశం
– గండిపేట్ మండలాధ్యక్షులు అశోక్‌యాదవ్
నవతెలంగాణ-గండిపేట్
అసంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కార్యకర్తలందరు సమన్వయంతో కలిసి రావాలని గండిపేట్ కాంగ్రెస్ మండలాద్యక్షులు క్యాతం అశోక్‌యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం నార్సింగి కాంగ్రెస్ అఫీసుల్లో అభ్యర్థి కస్తూరి నరేందర్ అద్వర్యంల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పార్టీ కోసం కలిసి పని చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై పూర్తిగా వ్యతిరేకమైందన్నారు. అందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన 6 గ్యారంటీలతో ప్రతి ఇంటికేళ్లి కాంగ్రెస్‌ను తప్పని సరిగా గెలిపించాన్నారు. రాజేంద్రనగర్ నియోజక వర్గంల్లో ఎలాంటి అబివృద్ది నొచుకోలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. అభ్యర్థి నరేందర్ మాట్లాడుతూ… తమకు గెలిపించేందుకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా కలిసి రావాలన్నారు. కాంగ్రెస్‌తోనే రాజేంద్రనగర్ నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసుకునేందుకు అవకాశమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కిరణ్‌కుమార్, మాజీ సర్పంచ్ గంగయ్య, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి ప్రదీఫ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి పెద్ద పుల్లి కృష్ణ, నాయకులు వేణుగౌడ్, దేవేందర్, కోల్లూర్ కిరణ్‌కుమార్, శ్రీనివాస్,జెల్లి వెంకటేష్, గిరిధర్‌రెడ్డి, మహేందర్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.