నవతెలంగాణ – నాంపల్లి : తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఆరు గ్యారెంటీ పథకాలు, నూరు గ్యారెంటీ సీట్ల లక్ష్యంతో ముందుకు కదులుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా చేపట్టిన ఆరు గ్యారెంటీ పథకాలు, నూరు సీట్ల సాధన లక్ష్యంగా లండన్ లో టి పి సి సి ఎన్నారై సెల్ యూకే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అలాగే మునుగోడు నియోజకవర్గం విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చలమల్ల కృష్ణారెడ్డికి మునుగోడు సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిట్టు రెడ్డి, అమర్ రెడ్డి, రక్షిత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.