– రాజస్థాన్‌లో నలుగురు, తమిళనాడులో ఒక స్థానానికి అభ్యర్థులు ఖరారు
న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆరో జాబితాను విడుదల చేసింది. ఇందులో ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకూ కాంగ్రెస్ మొత్తంగా 190 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం ఆరో జాబితాలో రాజస్థాన్‌లో నాలుగు, తమిళనాడులో ఒక స్థానానికి అభ్యర్థులను ప్రకటించింది. అలాగే తమిళనాడులో ఉప ఎన్నిక జరగనున్న విలవంకొడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. ఆరో జాబితా ప్రకారం రాజస్థాన్‌లో కోటా లోక్‌సభ స్థానం నుంచి ప్రహ్లాద్ గుంజల్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే అయినకాంగ్రెస్ ఆరో జాబితా విడుదల ప్రహ్లాద్ గుంజల్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధరరాజే సన్నిహితుడు గుంజల్‌కు పేరుఉంది. అలాగే, అజ్మర్ నియోజకవర్గం నుంచి రామచంద్ర చౌదరీని, రాజ్‌సమంద్ నుంచి సుదర్శన్ రావత్‌ను, భిల్వారా నుంచి దామోదర్ గుర్జార్‌ను కాంగ్రెస్ పోటీకి దింపింది. తమిళనాడులోని తిరునెల్వెలి నుంచి సి రాబర్ట్ బ్రూస్‌ను పోటీకి దింపింది. విలవంకొడ్ అసెంబ్లీ స్థానం నుంచి థరహై కుత్‌బెర్త్ బరిలోకి దింపింది.