ఇంటింటా ప్రచారం మొదలుపెట్టిన కాంగ్రెస్

నవతెలంగాణ- కోటగిరి: కోటగిరి మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలు అధికారంలో రాగానే ప్రవేశపెడుతుందని కాంగ్రెస్ పార్టీ ని ఆదరించాలని నియోజకవర్గ నాయకులు రోహిత్ ఆధర్వంలో ఇంటింటా ప్రచారం మొదలుపెట్టారు బంగారు తెలంగాణ ఆశలు బీఆర్ఎస్ ప్రభుత్వంతో అడియాశలు అయ్యాయని, ప్రజలకు నమ్మకద్రోహం కలిగించారని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని పేర్కొన్నారు వారి వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు మనోహర్, షాహిద్ తదితరులు పాల్గొన్నారు.