జీపీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ మద్దతు..

నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ చేపట్టిన నిరవధిక సోమవారం నాటికి ఐదో రోజుకి చేరింది. ములకలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొప్పుల రాంబాబు ఆధ్వర్యంలో కార్మికులకు మద్దతుగా ఎర్పాటు చేసిన వంట వార్పు కార్యక్రమానికి టిపిసిసి సభ్యురాలు వగ్గెల పూజ ముఖ్య అతిథిగా పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుగ్గారపు సత్యనారాయణ, ఖాదర్ బాబా, కిసాన్ సెల్ అధ్యక్షులు అచ్చన వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు బూరుగుపల్లి పద్మశ్రీ, పాత గంగారం సర్పంచ్ వాడే లక్ష్మి, బానోత్ అమర్ సింగ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పాలకుర్తి రవి, కోండ్రు భాస్కర్, మడకం శ్రీనివాస్, ధర్మరాజు, భూక్య శివ కార్యకర్తలు పాల్గొన్నారు.