ముదిరాజ్‌లను అణిచేసింది కాంగ్రెసే..

– పిట్టల రవీందర్‌ ముదిరాజ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వెనుకబడిన తరగతుల్లో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్‌ సామాజిక తరగతిని రాజకీయ, ఆర్థిక, సామాజి కంగా కాంగ్రెస్‌ పార్టీ అణచి వేసిందని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్‌ ఫెడరేషన్‌ చైర్మెన్‌ పిట్టల రవీందర్‌ ముదిరాజ్‌ విమర్శించారు.
సోమ వారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకర్ల సమావేశం లో ఆయన మాట్లాడుతూ కాసు బ్రహ్మానంద రెడ్డి కాలంలో నియమిం చిన అనంత రామన్‌ కమిషన్‌ నివేదికలో బీసీలను ఏబీసీడీ లుగా వర్గీకరించే క్రమంలో ముదిరాజులను బీసీఏ లో చేర్చటానికి బదులుగా బీసీ డీ లోకి మార్చారని తెలిపారు. దీంతో వారికి రిజర్వేషన్లలో అన్యాయం జరుగు తున్నదని పేర్కొన్నారు.
12 ఏండ్లుగా సుప్రీం కోర్టులో పెండింగ్‌ లో ఉన్న ముదిరాజుల రిజర్వేషన్‌ అంశాన్ని పరిష్కరించాలనే కృత నిశ్చయంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చొరవ తీసుకున్న దని తెలిపారు. సుప్రీం కోర్టు నుంచి తెలంగాణ బీసీి కమిషన్‌ అంతిమ పరిష్కారం సూచించే విధంగా చర్యలు తీసుకున్న దని గుర్తుకు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మత్స్య రంగాన్ని కూడా మరిచి పోయిందని తెలిపారు.