– జిల్లా కాంగ్రెస్ కమిటీ,రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి
నవతెలంగాణ – కంఠేశ్వర్
రాష్ట్రంలో సంవత్సర పాలనలో సంక్షేమ పథకాలు అభివృద్ధి సమానంగా ప్రజలకు అందించామని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజాపాలన సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించడానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటి రాక్షస పాలనను పక్కకు పెట్టి ప్రజా పాలన ను ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందనీ, టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పలు చేసి అన్ని శాఖలను విచ్చినం చేసిందని టిఆర్ఎస్ రాష్ట్రాన్ని చేసిన విచిన్నాని బాగు చేస్తునే మరో ప్రక్క ప్రజలకు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 500 కే గ్యాస్ సిలిండర్ అందించడం గానీ, ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచడం, గృహ జ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించడం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొరకు ఇందిరమ్మ కమిటీలను నియమించడం జరిగిందని, ప్రజా పాలన లో ప్రజా దర్బార్, అభయహస్తం, ప్రజావాణి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ రంగంలో రైతుల కొరకు రైతు రుణమాఫీ చేయడం గాని, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయడం గాని, రైతు భరోసా అందించడం గానీ, పంటల బీమా అందించడం గాని సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం గానీ, కొనుగోలు కేంద్రాలకు ప్రత్యేక అధికారులను నియమించడం గాని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని, అదేవిధంగా గడిచిన సంవత్సర కాలంలోనే 50 వేల ఉద్యోగాలను నియమించడం జరిగిందని అన్నారు.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని ,గతంలో ఆట బొమ్మగా చూసిన టిఎస్పిఎస్సి ని ప్రక్షాళన చేసి విద్యార్థుల జీవితాలు ఆగమ్యగోచరంగా కాకుండా బలంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తూ ఎగ్జామ్ లు, నిర్వహించడం జరుగుతుందని, గల్ఫ్ కార్మికుల కొరకు ప్రజావాణి ఏర్పాటు చేసి గల్ఫ్ బాధితులను ఆదుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని, విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడం జరిగిందని, గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విపరీతమైన అప్పులు చేయడం జరిగిందని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అప్పులకు వడ్డీలు కడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఏడాదిలోనే తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కొరకు 57 వేల కోట్లు ఖర్చు చేసిందని, రెండు లక్షల రుణమాఫీ ద్వారా 25 లక్షల మంది రైతులను రుణ విముక్తి చేయడం జరిగిందని, వీటికి తోడుగా రైతులకు సాగునీరు అందించే ప్రాజెక్టుల పనుల నిర్వహణకు దాదాపు పదివేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, గడిచిన పదండ్లలో టిఆర్ఎస్ చేసిన ఏడు లక్షల కోట్ల అప్పులకు ప్రతినెల 59,509 కోట్ల మిత్తిని చెల్లిస్తుందని, అదేవిధంగా కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్, విద్యుత్ సబ్సిడీ, స్కాలర్షిప్ పథకాలకు 60 వేల కోట్లు ఖర్చు చేసిందని, బిసి మైనారిటీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలకు గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు 9240 కోట్లు ఖర్చు చేసిందనీ ఆయన అన్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా తొలి 48 గంటల్లోనే మహిళలకు, ట్రాన్స్ జెండార్లకు, విద్యార్థినిలకు, బాలికలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈ పథకం ద్వారా ఇప్పటివరకు మూడు కోట్ల 26 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, తద్వారా మహిళలకు 129.53 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని, సగటున జిల్లాలో రోజుకు 93 వేల మంది మహిళలు బస్సులు ఉచిత సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని అన్నారు. అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో ఇచ్చిన హామీ మేరకు 500 కే వంట గ్యాస్ సిలిండర్ అందించడం ద్వారా జిల్లాలో 2.20 లక్షల కుటుంబాలకు 20. 50 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తున్న 2.47 కోట్ల కుటుంబాలకు జీరో బిల్లు అమలు అవుతుందని, తద్వారా 86.48 కోట్ల మేరకు లబ్ధి చేకూరిందని ఆయన తెలిపారు.
అందులో 75.85 కోట్ల రూపాయలను ట్రాస్కో కు తెలంగాణ ప్రభుత్వం చెల్లించడం జరిగిందని, అదేవిధంగా పంట రుణాల మాఫీ ద్వారా రెండు లక్షల లోపు ఉన్న రైతులకు దాదాపు జిల్లాలో 100612 మంది రైతులకు వారి వారి ఖాతాలో 782.30 కోట్లు జమ చేయడం జరిగిందని తద్వారా రైతులు రుణ విముక్తి చెందారని మానాల మోహన్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు నిజం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి ప్రభుత్వం ఇప్పటికే రెండు వేల కోట్ల రూపాయలను వడ్డీ రూపంలో చెల్లించడం జరిగిందని, త్వరలోనే నిజం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి ఉత్తర తెలంగాణలోని రైతులకు మేలు చేస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇంత చేస్తున్న కూడా ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతిపక్షాల కండ్లకు కనిపించడం లేదా అని మానాల మోహన్ రెడ్డి ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూడా చైర్మన్ కేశవేణు, గ్రంథాలయ చైర్మన్ అంతా రెడ్డి రాజారెడ్డి, మాజీ బీసీ సెల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్ ,రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్, జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వేణు రాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్ ,జిల్లా సేవదళ్ అధ్యక్షులు సంతోష్ ,జిల్లా ఫిషర్మెన్ చైర్మన్ శ్రీనివాస్ , ఎన్ ఎస్ యు ఐ నాయకులు అఖిల్, శశి కుమార్ ,సాయికిరణ్, తదితరులు పాల్గొన్నారు.