కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు..

నవతెలంగాణ – చండూరు 
భువననగిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి  అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయోత్సవ సంబరాలను మంగళవారం మున్సిపల్   కేంద్రంలో భారీ  ర్యాలీ నిర్వహించి, డీజే ఆటపాటలతో  మనసంచా   కాల్చి ఘనంగా నిర్వహించారు. అనంతరం  స్వీట్లు పంపిణీ చేశారు.  6301 మెజార్టీ ఇచ్చినందుకు గాను చండూరు మండల  ప్రజలకు  కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్షులు కొరిమి ఓంకారం, డాక్టర్ కోడి శ్రీనివాసులు, జిల్లా నాయకులు  దోటి వెంకటేష్ యాదవ్, పట్టణ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్ గౌడ్,ఎంపీటీసీ పల్లె  వెంకన్న,నల్లగంటి మల్లేష్, మంచుకొండ  సంజయ్, భీమనపల్లి శేఖర్ గౌడ్, బూత రాజు వేణు భూతరాజు దశరథ, సపిడి రాములు, కావాలి ఆంజనేయులు, గండూరి జనార్ధన్,  కల్లెట్ల మారయ్య, తదితరులు పాల్గొన్నారు.