
నవతెలంగాణ – బొమ్మలరామారం
భువననగిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయోత్సవ సంబరాలను మంగళవారం బొమ్మలరామారం మండలంలోని రామలింగపల్లి గ్రామంలో ర్యాలీ నిర్వహించి, భనసంచాలు కాల్చి ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. మెజార్టీ ఇచ్చినందుకు గాను మండల ప్రజలకు కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఏర్వ హేమంత్ రెడ్డి, తాజా మాజా సర్పంచ్ యంజాల కళా సత్యనారాయణ, గ్రామ యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.