– యువజన కాంగ్రెస్ నాయకులు చేతాల సతీష్
నవతెలంగాణ-మంచాల
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని యువజన కాంగ్రెస్ నాయకులు చేతాల సతీష్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 14 ఏండ్ల నుంచి ఎమ్మెల్యే ఉన్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైయ్యారు. బీఆర్‌ఎస్ అధికారంలో నిధులు తేవడంలో వెనుకబడిపోయారని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారనీ, ఇబ్రహీంపట్నంలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. కావున నియోజకవర్గ ప్రజలం దరూ చేయ్యి గుర్తుకు ఓటేసి, మల్‌రెడ్డి రంగారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.