– డీసీసీ ఉపాధ్యక్షుడు బోలుసని భీంరెడ్డి
నవతెలంగాణ-కుల్కచర్ల
రాష్ట్రంలో కాంగ్రెస్ గాలివీస్తుందని పరిగి నియోజక వర్గంలో డాక్టర్ రామ్మోహన్ రెడ్డి విజయం తథ్యమని కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బోలుసని భీంరెడ్డి, సీనియర్ నాయకులు తమ్మలి రామచంద్రయ్య ఎంపీటీసీ చెలిమిల్ల ఆనందం ముదిరాజ్, రజక సంఘం జిల్లా ప్రధాన కార్య దర్శి మోత్కూర్ వెంకటేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగని అంజనేయులు అన్నారు. శనివారం కుల్కచర్ల మండల కేంద్రంలో ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ 6 గ్యారెంటీ పథకా లపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని, గతంలో ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిందని, ఉచితంగా కరెంట్‌ను ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇం డ్లను ఇచ్చామని, భూముల్లేని వారికి భూములిచ్చిన ఘన త కాంగ్రెదేనన్నారు. దళితబంధు, బీసీ, మైనార్టీ, గిరిజన బంధు వంటి పథకాలతో ప్రజలను మరోసారి మభ్యపె ట్టేందుకు కుట్రలు చేస్తుందన్నారు. బీఆర్‌ఎస్ ఎన్నికల్లో ప్రజల ఓట్లను రాబట్టేందుకు సాధ్యంకానీ హమీలిస్తుం దన్నారు. బీఆర్‌ఎస్‌ను నమ్మె పరిస్థితుల్లో ప్రజలు లేరని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధిం గా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నేరవేర్చగలిగే హామీలను ఇస్తుందని, ఇచ్చిన మాటాను నిలబెట్టుకుం టుందన్నారు. కార్యక్రమంలో భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు ఐలగారి కష్ణయ్య, మిద్దె భీమయ్య, కంగారి రవి పోతగల బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.