కర్ణాటక తరహాలో తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం ఖాయం

– బీజేపీ ప్రభుత్వానిది బ్లాక్‌ మెయిల్‌ రాజకీయం
– గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించాలి
– మహారాష్ట్ర మాజీ హౌం మంత్రి, కొల్హాపూర్‌ ఎమ్మెల్యే సాతేజ్‌ డి పాటిల్‌
నవతెలంగాణ-నర్సాపూర్‌
రానున్న ఎన్నికల్లో కర్ణాటక తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మహారాష్ట్ర హౌం మినిస్టర్‌ కోల్హా పూర్‌ ఎమ్మెల్యే సాతేజ్‌ డి పటిల్‌ అన్నారు. సోమవారం నర్సాపూర్‌ పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో తుక్కుగూడ విజయ బేరి సభలో కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో ఐదు గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టి అధికారంలోకి రావడం జరిగిందని అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. 6 గ్యారంటీ పథకాలే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పట్ల రోజురోజుకు ప్రజలు విసుగు చెందుతున్నారన్నారు . కాంగ్రెస్‌ పార్టీని గెలిపించడానికి ప్రజలు ఉత్సాహంగా ఉన్నారన్నారు. తెలంగాణ రైతులను పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇతర రాష్ట్రాల రైతులకు న్యాయం చేస్తాననడం హాస్యాస్పదమన్నారు. అడ్వర్టైజ్మెంట్‌ చేయడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు తప్ప అభివద్ధి మాత్రం శూన్యమన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఈడి, సీబీసీఐడీల పేరట ప్రజలను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గాలి అనిల్‌ కుమార్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డిలు మాట్లాడుతూ సి డబ్ల్యూ సి సమావేశం రాష్ట్రంలో నిర్వహించడం తాము ఎంతో అదష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు ఆంజనేయులు గౌడ్‌, రవీందర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు మల్లేశం, సుదర్శన్‌ గౌడ్‌, కష్ణ, మల్లేశం, నాయకులు అశోక్‌ గౌడ్‌, శ్రీనివాస్‌ గుప్తా , అశోక్‌, రిజ్వాన్‌, ఆనంద్‌, రషీద్‌ తదితరులు పాల్గొన్నారు.