బోర్గం గ్రామంలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం

నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండల కేంద్రంతో పాటు, బోర్గం గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆయా గ్రామాలలోని గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్  అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డి కి అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని వారు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆరు గరెంటీ పథకాలను తూచా తప్పకుండా అమలు చేస్తారని వారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కవిత, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఇందిరా రెడ్డి, బూర్గం గ్రామ అధ్యక్షుడు చీరడి రవి, గొజ్జా భూమన్న, సిద్ధ సాయిలు, గాండ్ల పవన్, రవి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.