నవతెలంగాణ – మల్హర్ రావు
కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి లకావత్ సవెంధర్ అన్నారు.బుధవారం మండలంలోని కొయ్యుర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు ఆశీర్వడంతో మండల మాజీ ఎంపీపీ, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ గా నియమితులైయ్యారని,ఇందుకు మంత్రి దుద్దిళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మండలం వల్లెంకుంట గ్రామనికి చెందిన అయిత ప్రకాష్ రెడ్డి తన రాజకీయ గురువు స్వర్గీయ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ లో క్రమశిక్షణ గల కార్యకర్తగా పని చేసుకుంటూ వల్లెకుంట గ్రామ సర్పంచ్ గా, మండల ఎంపిపిగా,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా క్రమశిక్షణ కార్యకర్తగా ఎడిగారని,ఇందుకు ప్రకాష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల్లో టిఆర్ఎస్ పార్టీ అన్యాయాలను ఎండ కడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎంతగానో కృషి చేశారని తెలిపారు.భవిష్యత్ లో ప్రకాష్ రెడ్డి ఇలాంటి పదవులు మరెన్నో చేపట్టాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ మహమ్మద్ ఖలీముద్దీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయిని రాజయ్య యాదవ్, వెన్నపురెడ్డి శ్రీనివాస్, లక్ష్మణ్, రమేష్, సమ్మయ్య పాల్గొన్నారు.