
తుక్కుగూడలో జరుగుతున్న జన జాతర భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగాని బసవయ్య గౌడ్ జన జాతరకు శంకరపట్నం మండల పరిధిలోని కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం భారీగా హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బసవయ్య మాట్లాడుతూ..జాతీయ కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికలలో దేశమంతా అమలుపరిచే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్న అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నరని భారీ బహిరంగ సభకు మండల పార్టీ కార్యవర్గం, అనుబంధ సంఘాల అధ్యక్షులు, గ్రామ శాఖల అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీగాతరలి వెళ్లినట్టు ఆయన తెలిపారు.