
గ్రామ పంచాయతీ ఎన్నికలలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని హౌజుబుజుర్గు కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు ఎస్డి షరిఫ్ అన్నారు. యువత అధికారంలో ఉంటే గ్రామ రూపురేఖలు మార్చే సత్తా ఉందన్నారు. ప్రభుత్వం స్థానిక సంస్థల్లో యువతకు ప్రాధాన్యత ఇస్తే వారి ఆలోచనలతో పల్లెలు అభివృద్ధి చెందుతాయని అబిప్రాయం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో దేశ, రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లో ఉంటుందని అన్నారు. యువత విజ్ఞానం, నూతన ఆలోచనలు , సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామాలను అభివృద్ధి దిశగా నడిపిస్తారన్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు యువకుల్ని రాజకియ్యల్లో ప్రోత్సహించాలని కోరారు.