మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు చింతకుంట కిషన్ గురువారం ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థి జాజాల సురేందర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. కాంగ్రెస్లో కార్యకర్తల మీద నమ్మకం లేక, కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయడానికి, దేవుళ్లపై ప్రమాణాలు చేయిస్తున్నారని ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీను నాయక్, హబీబ్ తదితరులు ఉన్నారు.